![]() |
![]() |

ఢీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం మాస్ థీమ్ కాన్సెప్ట్ తో ఈ షో అలరించింది. ఇక ఈ షోలో సోనియా-సిద్దు వాళ్ళ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. "ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నేను చేసుకున్న అదృష్టం మాష్టర్. ఒక 25 ఇయర్స్ వరకు 30 ఇయర్స్ వరకు అమ్మ ప్రేమ ఉంటుంది. కానీ ఆ తర్వాత లైఫ్ పార్టనర్ వస్తుంది...ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి వేరైపోతారు అంటారు. కానీ నెక్స్ట్ 40 ఇయర్స్ వరకు నాకు సోనియా రూపంలో అమ్మ ప్రేమ దొరికింది మాస్టారు" అని సిద్దు చెప్పాడు.
తర్వాత సోనియా మాట్లాడుతూ "సిద్దు నా లైఫ్ లోకి వచ్చాక నేను మా నాన్నను, నా బ్రదర్ ని మిస్సవలేదు. ఇంకేముందు నా ప్రపంచం మొత్తం సిద్దునే ఐపోయాడు. ఫ్యూచర్ హజ్బెండ్ దొరికేసాడు." అని చెప్పింది సోనియా. యూట్యూబర్, నటి అయిన సోనియా సింగ్, నటుడు సిద్ధూ పవన్ పాపులర్ సెలబ్రిటీ కపుల్. సోనియా సింగ్, సిద్ధూ పవన్ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో కలిసి నటించిన ఈ ఆన్ స్క్రీన్ కపుల్ త్వరలోనే ఆఫ్ స్క్రీన్ కపుల్ గా మారబోతున్నారు. సిద్దు ఏమో అర్దమయ్యిందా అరుణ్ కుమార్ మూవీలో నటించాడు అలాగే సోనియా ఐతే విరూపాక్ష మూవీలో చిన్న రోల్ లో నటించింది. అలాగే వీళ్ళిద్దరూ శశిమధనం మూవీలో కలిసి చేశారు. ఇక వీళ్ళు ఢీ షో ఆది-అశ్వినికి ప్రత్యర్థి జోడీగా చేస్తున్నారు.
![]() |
![]() |